- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమాచారం లేకుండా భూ సర్వే నా..?
దిశ, గుమ్మడిదల : మా భూముల్లో మాకు సమచారం ఇవ్వకుండా సర్వేను ఎలా నిర్వహిస్తారని రెవెన్యూ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని వివాదాస్పద భూమి సర్వేనంబర్ 261లోని, 315 ఎకరాల పట్టా భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సర్వేయర్లు గురువారం ఉదయం సర్వే నిర్వహించడం కోసం అక్కడికి చేరుకోగా వారిని పట్టాదారులు అడ్డుకున్నారు. మా భూముల్లో మాకు ముందస్తుగా ఎలాంటి సమాచారం కానీ నోటీసులు గానీ ఇవ్వకుండా ఎవరి స్వలాభం కోసం సర్వేను నిర్వహించడానికి వచ్చారని వాగ్వాదానికి దిగారు. సర్వేకు తాము సహకరిస్తామని కానీ అందుకు గల కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారులు మాత్రం వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెనుతిరిగారు. అనంతరం పట్టాదారులు మాట్లాడుతూ పట్టా భూముల్లో సర్వే చేయాలంటే సంబంధిత పట్టాదారుడికి ముందుగా నోటీసు గానీ సమచారం గానీ ఇవ్వాలని అన్నారు. కానీ అధికారులు మాత్రం తమకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 261 లోని 315 ఎక్కరలా పట్టా భూముల్లో కేవలం కొంతమంది బడా బాబులకు పరిశ్రమలకు లాభం చేకూర్చడానికే సర్వేను నిర్వహించడానికి వచ్చారని విమర్శించారు. అందుకే వారు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో, కర్ణాకర్ రావు, ఆర్ఐలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సర్వైవర్లు ఖలీల్, పట్టాదారులు దర్మెందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.