సీఎం ఇలాకాలో ఆత్మహత్యల పరంపర.. ఈటల ఫైర్

by samatah |
సీఎం ఇలాకాలో ఆత్మహత్యల పరంపర.. ఈటల ఫైర్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : డబుల్ బెడ్ రూం రావడం లేదని నిన్న సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న శిలసారం రమేష్ మృతదేహానికి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. రమేష్ స్వగ్రామం గజ్వేల్ మండలము ఆహ్మదిపుర్ కు వచ్చి బడిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సంధర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ ఎలుగబెడుతున్న ఇలాకాలో నిత్యం ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

దళితులు పేద వర్గాలు సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక.. పార్టీ నాయకుల కన్ను ఉంటే తప్ప సమస్యలు పరిష్కారం కాకపోవడంతో.. ఆత్మహత్యలు కోకొల్లలుగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జరిగిన ఆత్మహత్యలు కప్పిపుచ్చడానికి పోలీసులను ప్రయోగించి భయపెడుతున్నారన్నారు. డబ్బులు ఇస్తున్నారు. మనిషికి వెలగట్టి డెడ్ బాడీలను పోలీసుపహారాలో జేసీబీలు పెట్టీ పూడ్చిపెడుతున్నారన్నారు.

నిన్న చనిపోయిన రమేష్ ఆంజనేయులువి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలు. ఏ ఆఫీస్‌కు పోయిన భూ సమస్యలు పరిష్కారం కావడంలేదు. మీ పనులు కావాలంటే టీఆరెఎస్ లో చేరాలని పోలీసులే చెప్పే నీచస్థితికి యంత్రంగం చేరుకుందనీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పెన్షన్లు రావాలంటే, కళ్యాణ లక్ష్మీ ఇవ్వాలంటే మా పార్టీలో ఉండాల్సిందే అని మంత్రులు స్వయంగా చెప్పే

పరిస్థితి తయారైందన్నారు. కేసీఆర్ నీ అబ్బ జాగీరు కాదు అని మర్చిపోకు. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నీ ఫాం హౌస్ భూములు అమ్మి, సొంత ఆస్తులు అమ్మడం లేదు. ప్రజల సొమ్ము. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. పేదలకు కన్నీళ్లు, శవాలు మిగులుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ ఆంజనేయులు ఆత్మహత్యలు ప్రభుత్వ దుర్మార్గానికి, వైఫల్యానికి నిదర్శనం. అందుకు ప్రభుత్వం భాద్యతవహించి ప్రతి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. పంజాబ్, హర్యానా వెళ్ళి చెక్ లు ఇస్తున్నవు. మాకు ఎందుకు ఇవ్వవు ? తెలంగాణ ను అప్పుల కుప్పలా మార్చింది నువ్వు. నిత్యం చావులే. . తెలంగాణ మేధావులారా ఆలోచించండి ఇక్కడ ఏం జరుగుతుందో, తెలంగాణలో జరుగుతున్న మొత్తం తెలంగాణ ఆత్మహత్యల మీద విచారణ జరగాలి. మా నోరు మోయించవచ్చు కానీ మీరు చేస్తున్న నీచపు పనులు తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మీ భరతం పడతారని రాజేందర్ హెచ్చరించారు.

రఘునందన్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఒక అమాయక పేద వ్యక్తి ప్రాణాలు తీసుకున్నారు. సిద్దిపేటలో ఇళ్లు రావాలి అంటే ముడుపులు చెల్లించాల్సిందే చనిపోయిన రమేష్ క‌లెక్టర్ తో సహా స్థానిక మంత్రి, అధికారులు అందరికీ అనేక సార్లు మొరపెట్టుకున్నారు.4 సార్లు లిస్ట్ లో పేరు వచ్చింది. కానీ స్థానిక కౌన్సిలర్ రాకుండా అడ్డుకున్నారు. పారదర్శక పాలన ఇదేనా? పేద రైతు, ఆటో నడుపుతున్నారు, రేషన్ కార్డు ఉంది ఇంతకంటే అర్హత ఎంకావాలి. చనిపోయాక కేసు రాజీ చెయ్యడానికి వచ్చిన వారు ముందు ఇళ్లు ఇప్పించి ఉంటే రమేష్ బతికే వారు కదా అన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత పోస్ట్ మార్టం చేసి పోలీసు బెటాలియన్ మధ్య శవాన్ని తరలించారు. ప్రభుత్వం తప్పు చెయ్యకపోతే ఇదంతా ఎందుకని ప్రశ్నించారు. ఆయన దగ్గర ఇళ్లు కోసం 80 వెలు తీసుకున్నారు. కండువా వేసుకున్న కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు ఇస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story