- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను చెప్పినా పట్టించుకోరా..!
దిశ, అందోల్: గ్రామాల్లో కిరాణం షాపుల్లో.. ఎక్కడపడితే అక్కడ... బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్న విషయాన్ని తానే స్వయంగా ఎక్సైజ్ అధికారులకు తెలిపిన పట్టించుకొవడం లేదని ఎక్సైజ్ అధికారులపై జడ్పీటీసీ రమేష్ మండిపడ్డారు. సోమవారం అందోలు మండల సర్వసభ్య సమావేశానికి జోగిపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం లభించడం వలన యువకులు మద్యానికి బానిసవుతున్నారని, మద్యం విక్రయాలను కట్టడి చేయాలన్నారు. మన ఊరు–మన బడి కింద రూ.75 లక్షల వరకు పనులు చేపడితే, బిల్లులు రావడం లేదని బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండా, పంచాయతీ అనుమతిని తీసుకొకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలను చేపడుతున్నారని వాటిని కట్టడి చేయాలంటూ ఎంపీవో సౌజన్య దృష్టికి తీసుకురాగా, వారిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మన ఊరు–మన బడి కింద చేపట్టిన పనులకు బిల్లులు కావాలంటే నేరడి గుంట సెక్రెటరీ నరసింహ పర్సెంటేజ్ ఇవ్వాలని అడుగుతున్నారని ఎంపీటీసీ కృష్ణాగౌడ్ ఆరోపించారు.
గొర్రెల యూనిట్‌లకు సంబంధించి 551 మంది డీడీలు కట్టారని, అందులో 120 మంది తమ డీడీలను క్యాన్సల్ చేసి డబ్బులు ఇవ్వాలని ఫిర్యాదులు వచ్చాయని పశువైద్యాధికారి హర్ష వర్ధన్‌రెడ్డి అన్నారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో పశువుల తొట్టిలను నిర్మిస్తామని, మరమ్మత్తులు చేపడతామన్నారు. పోసానిపేట, సంగుపేట, అల్మాయిపేట, తాడ్మాన్నూర్, డాకూర్ గ్రామాలలో నీటి ఎద్దడి ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. అక్సాన్‌పల్లి, తాడ్మన్నూర్, డాకూర్ గ్రామాలకు నూతనంగా అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు నిధులు మంజూరయ్యాయని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తెలిపారు.
నేరడిగుంటకు ఆర్‌టీసీ బస్సు సర్వీస్‌ను పునఃరుద్దరించాలని సభ్యులు జోగిపేట బస్టాండ్ కంట్రోలర్ ఫక్రొద్దీన్‌ను కొరారు. కాలువల ద్వారా చెరువుల్లోకి వచ్చే సింగూరు నీరు అక్కడక్కడ పంట పోలాల్లోకి వచ్చి చేరుతుందని, పంట నష్టం జరగకుండా ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ ఎంపీపీ బాలయ్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్, తహశీల్దార్ భాస్కర్ కుమార్, ఆందోల్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ మధుకర్‌రెడ్డి, ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న, ఎంఈవో కృష్ణ, ఎంపీటీసీలు జనార్ధన్, నందిని నర్సిహులు, ఉమారాణి జనార్ధన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.