- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకమ్మ దసరా ఆఫర్ల పేరిట కాల్స్ నమ్మవద్దు : సిద్దిపేట సీపీ
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ డా. అనురాధ అన్నారు. బతుకమ్మ దసరా పండుగ ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి డబ్బులు పంపించి మోస పోవద్దు అన్నారు. గూగుల్ ఫే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పోగొట్టు కొన్నా వెంటనే లేదా, 24 గంటల లోపు జాతీయ హెల్ప్ లైన్ నం. 1930, 112, 100 ల్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఫె డెక్స్ కొరియర్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతాయి అప్రమత్తంగా ఉండాలన్నారు. హనీ ట్రాప్ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మీ కొడుకు విదేశాల్లో డ్రగ్స్ అమ్ముతూ పట్టు పడ్డాడు, మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని కేసులో ఇరుక్కున్నాడు అని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరిస్తారని వారి బెదిరింపులకు ఎవ్వరు కూడా ఆందోళన చెంద వద్దు అని పోలీసు కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సూచించారు.