క్రీడలతో మానసిక ఉల్లాసం.. కలెక్టర్

by Sumithra |
క్రీడలతో మానసిక ఉల్లాసం.. కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : క్రీడలు మనోధైర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ క్రీడలు ప్రారంభించి క్యారమ్స్, చెస్, షార్ట్ పుట్ వేసి వేసి దివ్యాంగులను ప్రోత్సహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏటా జిల్లా స్థాయిలో క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇంచార్జ్ జయదేవ్, సెవెంత్ వార్డు కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చి రెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు వసతులను పరిశీలించారు. వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారిని ఆదేశించారు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ ను కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. స్టూడెంట్ మేనేజ్మెంట్ మెస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రవినాథ్ కు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed