‘దిశ’ ఎఫెక్ట్.. కంకర క్రషర్ల ఏర్పాటుపై విచారణ

by Aamani |
‘దిశ’ ఎఫెక్ట్.. కంకర క్రషర్ల ఏర్పాటుపై విచారణ
X

దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని రాళ్ళకత్వ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కంకర క్రషర్లపై మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. "అసైన్డ్ భూముల్లో కంకర క్రషర్లు', బ్లాస్టింగ్ బాంబు శీర్షికల పేరిట దిశలో వరుస కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ కథనాలకు స్పందించి మైనింగ్ శాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు రాళ్లకత్వ శివారులో గల కంకర క్రషర్లపై విచారణ చేపట్టారు.

రాళ్ల కత్వ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న నూతన కంకర క్రషర్ క్వారీలపై వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని స్టేట్ మైన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ ఎడి రఘుబాబు, డిడి నిజామాబాద్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలను, కాలువలను, పంట పొలాలను రైతులు అధికారులకు చూపించి వాస్తవ విషయాలను వివరించారు. తాము చెప్పిన విషయాలను రాష్ట్ర అధికారులకు తెలియజేయాలని రైతులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో శివానగర్, రాళ్లకత్వ, దాది గూడ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed