- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గజ్వేల్‌లో రోడ్డెక్కిన ప్రజలు.. అందరికీ ఆదర్శం అంటారు.. మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లేవి..?
దిశ కొండపాక: గజ్వేల్ పట్టణంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, సమగ్రంగా సర్వే నిర్వహించాలని డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలో సమగ్రంగా సర్వే నిర్వహించి అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డబుల్ బెడ్ రూమ్ జిల్లా అధికారి శ్యాం ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దుచేసి మొదటి ప్రాధాన్యతగా మీకే ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ సర్వే నిర్వహించకుండా సొంత ఇండ్లు, ఆస్తులు కలిగిన వారికి స్థానికంగా గుర్తింపు కార్డు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ జాబితాలో పేర్లు వచ్చాయని విమర్శించారు. 30 సంవత్సరాల పైబడి అద్దెకు ఉంటూ అన్ని రకాల అర్హత ఉన్న వారి పేర్లు జాబితాలో లేవని, డబుల్ బెడ్ రూమ్ ఎంపికలో అవినీతి జరిగిందని ఆరోపించారు.
గజ్వేల్ పట్టణంలో 5000 మందికి ఇల్లు ఇస్తామని తెలిపి ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పేదలందరికీ మోసం చేస్తుందని దుయ్యబట్టారు. స్థానిక మున్సిపల్, రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగిన , ప్రజా ప్రతినిధులకు పేర్లు రాసి ఇచ్చిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్నిటికీ ఆదర్శంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం పట్టణంలోని ప్రజలందరికీ ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ నాయకులు నర్సింహులు, పద్మ, వెంకటచారి, స్వామి, గణేష్, శివయ్య, సంపత్, మానస, లక్ష్మి, అయేషా, కవిత, శ్రీనివాస్, బాసయ్య తదితరులు పాల్గొన్నారు.