మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు...

by Kalyani |
మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు...
X

దిశ, కొమురవెల్లి: భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కొనేరులో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు, భక్తి శ్రద్దలతో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా పట్నం, అభిషేకం, అర్చన, నిత్యకల్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ కండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు వంటి తదితర మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైనున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. ఆదివారంను పురస్కరించుకొని స్వామి వారి మూల విరాట్ ను పదకొండు రకాల పూలమాలలతో అలంకరించారు.

మల్లన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ…

దేవాదాయ ధర్మాదాయ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొండా సురేఖకు ఆలయ వర్గాలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం అందజేయగా, అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, pacs డైరెక్టర్ బత్తిని నర్సింహులు, సీనియర్ నాయకులు సనాది భాస్కర్, రమణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story