- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం
దిశ, సంగారెడ్డి : అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, విద్యా, వైద్యం, సీజనల్ వ్యాధులు, తాగునీరు, లోన్ వీవర్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏడు మాసాలు అయ్యిందని, ఏడు మాసాల నుంచి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించాలని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు జిల్లా యంత్రాంగం,
అడ్మినిస్ట్రేషన్ చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన వెంటనే ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుకు అధికారులు ప్రతి నెలా లేదా రెండు నెలలకోసారి సమీక్ష నిర్వహించుకుని ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమేమి అందిస్తున్నాం..ఇంకా ఏమేమి అందించాలని నోట్స్ రాసుకుని అమలు చేయాలని సూచించారు. అంతే కాకుండా అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, దాని కోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మైనింగ్ తో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వం నుంచి ముఖ్యంగా నాలుగు శాఖలకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగిందని, రెవెన్యూ, పీసీబీ, ఎక్సైజ్ , పవర్ రెగ్యూలేటరీ ఇచ్చామన్నారు. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మాలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్ రావు, సంజీవరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.