- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాదు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుపై ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ పై వివక్ష చూపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ...దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాదని జోష్యం పలికారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దెర హామీలను అమలు చేస్తుందని ఎద్దేవ చేశారు.
రైతు బంధు, రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్, మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం, వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంపు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో నీళ్ళ, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. రైతుల విషయంలో కేసీఆర్‌కు ఉన్న ప్రేమ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. సగం మంది రైతులకు రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ మాట తప్పారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల పట్ల అంతటా చర్చ మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు ఎంపీ ఎన్నికలు రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ పాఠశాల, దేశంలో 157 మెడికల్ మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు, తెలంగాణ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షను ప్రజలల్లోకి తీసుకెళ్లి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.