రోహిత్ నినాదాలతో మారు మ్రోగిన మెదక్...

by Sumithra |
రోహిత్ నినాదాలతో మారు మ్రోగిన మెదక్...
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున సంబురాలు నిర్వహించారు.. కౌంటింగ్ పూర్తయిన ఫలితాలు వెలువడిన వెంటనే నియోజక వర్గం నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 10,536 ఓట్ల మెజారిటీతో గెలుపుతో మెదక్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అంతకు ముందు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ లోని వెంకటేశ్వర గార్డెన్లో ఏర్పాటు చేసిన భారీ తెర పై కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ఫలితాలను వీక్షించారు. తమ అభ్యర్థి గెలుపుతో పార్టీ శ్రేణులు ఉత్సాహం నెలకొంది. దీంతో డీజే, డప్పుచప్పులతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే పట్టణ రాందాస్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు విజయోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి బాణ సంచాలు కాల్చి నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story