- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Kranthi Valluru : నిర్ణీత గడువులో మహిళా శక్తి లక్ష్యాలను నెరవేర్చాలి
దిశ, సంగారెడ్డి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్లను ఈ నెల ఆఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి , పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో భాగంగా స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టుపని, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందు కోసం ప్రభుత్వం 13 రకాల స్కీంలను తీసుకు వచ్చిందన్నారు.
డైరీ ఫాం, కుట్టుపని కేంద్రాలు, మొబైల్ చేపల విక్రయ కేంద్రాలు, వ్యవసాయ యంత్ర సామాగ్రి అద్దె యూనిట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, డైరీ ఫామ్ లో డైరీ పార్లర్ ఇలాంటి 13 రకాల ఎన్నికలు ఈ నెలాఖరులో ఒక గ్రౌండ్ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామంలో ప్రతి వార్డులో పారిశుధ్యం నిర్ములనకు ముగ్గురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లాలోని గ్రామాభివృద్ధి శాఖ డీపీఎంలు, ఏపీఎం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.