- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ ది బూటకపు పాలన..! : హరీష్ రావు
దిశ, మెదక్ ప్రతినిధి: ఆరు గ్యారంటీ లు.. పదమూడు హామీ బాండ్లు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బూటకపు పాలన చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావ్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని, పార్లమెంటు తెలంగాణ కోసం ప్రశ్నించే ప్రశ్నించే గొంతుక కావాలి అంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలను రాష్ట్రం నుంచి గెలిపిస్తే ఏనాడు పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కులు కాపాడటమే బీఆర్ఎస్ ఎజెండా అన్నారు.
14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, 10 ఏండ్లు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేస్తే కాంగ్రెస్ దండగ చేస్తోందని, రూ. 20 లక్షల పంట ఎండిపోతే సీఎంకు వెళ్లే తీరిక లేదు కానీ, ప్రతి పక్ష నేతలను, ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం, ఢిల్లీ చుట్టూ తిరిగే తీరిక మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరని ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేయ్యాలో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధాల పాలన చూసి ఓటేయాలా... ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నందుకు వేయాలా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ జరిగిన వారంతా కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.. రాని వారు మాత్రం బీఆర్ఎస్‌కు ఓటెయ్యండి అని అన్నారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కంగనే అన్ని హామీలు మర్చిపోయారాని అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. నాలుగు వేల పెన్షన్ రానోళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి.. ఇస్తే కాంగ్రెస్‌కు ఓటేయండి కోరారు. రాష్ట్రంలో రూ. 2500 పొందిన మహిళకు ఇంతవరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ రైతులను, మహిళలను, వృద్ధులను మోసం చేసిందన్నారు. నాలుగు నెలల్లో 140 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ అమలు కావడం లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌ను ముంచుడు ఖాయమని, ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ప్రజల పక్షాన హామీలు అమలు చేసేదాక పోరాడుతామని తెలిపారు. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్టు అప్రజాస్వామికం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవిత అరెస్ట్ సమంజసమన్నారని ఇది ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అదానీ, అంబానీలు మోడీ దోస్తులు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ గాంధీ చెప్బితే.. గుజరాత్ మెడల్ సూపర్ అని రేవంత్ అంటున్నారని అన్నారు. బీజేపీతో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌యేనని, బీజేపీతో కలవనందుకే కవిత ను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. బీజేపీతో దోస్తాన్ ఎవరో.. శత్రువు ఎవరో ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, మాణిక్యం, ఫారూఖ్ హుస్సేన్, తిరుపతి రెడ్డి, ఏకే. గంగాధర్ రావు, శశిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.