కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి

by Shiva |
కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి: కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మెదక్ పట్టణ శివారులోని మాత, శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. మెదక్ మండలం రాజ్ పల్లికి చెందిన దయాకర్ (50) పని నిమిత్తం బైక్ పై పట్టణానికి వచ్చి స్వగ్రమానికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గ మధ్యలో చేగుంట నుంచి వస్తున్న కారు దయాకర్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడిన దయాకర్ కు తీవ్ర గాయాలై అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story