గంజాయి పట్టివేత…నిందితుడిని రిమాండకు తరలింపు

by Kalyani |
గంజాయి పట్టివేత…నిందితుడిని రిమాండకు తరలింపు
X

దిశ, చిన్నశంకరంపేట: నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం రాత్రి అరెస్టు చేసి గంజాయి స్వాధీనం పరుచుకుని మంగళవారం రిమాండ్ తరలించినట్లు రామాయంపేట సీ ఐ. వెంకట రాజాగౌడ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎస్ఐ. నారాయణ తన సిబ్బందితో పద్మనాభ స్వామి గుట్ట మిర్జాపల్లి ఎక్స్ రోడ్ లో గంజాయి విక్రయిస్తున్న రాజును అదుపులో తీసుకొని, అరెస్టు చేయగా, నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో గల పద్మనాభస్వామి గుట్ట మిర్జాపల్లి రోడ్డు సమీపంలో నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ పోలీసు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఒక వ్యక్తి కాలేజీ బ్యాగ్ తో కనిపించగా, అనుమానం రావడంతో అతని పట్టుకొని విచారించగా, సిగరెట్లలో గంజాయి కలుపుకొని తాగే అలవాటు ఉందని నిందితుడు తెలిపినట్లు సిఐ తెలిపాడు.

గంజాయి విలువ సుమారు పదివేల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఒక సెల్ ఫోను స్వాధీనపరుచుకుని నిందితుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. మండల కేంద్రంలో పరిశ్రమలు ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి మత్తుకు బానిసై గంజాయి డ్రగ్స్ వంటి అలవాట్లకు పాల్పడుతున్నారని, వీరి పట్ల జాగ్రత్తలు వహించి అనుమానం వచ్చిన వారిని పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. ప్రజలు సహకరిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టేందుకు పోలీసులు ముందుంటారని అన్నారు.గంజాయి కేసును ఛేదించిన చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుల్ రాజశేఖర్, రాజు, ఆంజనేయులు, వెంకటేశం, విట్టల్ ను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed