తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్న బీఆర్ఎస్: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Shiva |   ( Updated:2023-04-10 15:32:21.0  )
తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్న బీఆర్ఎస్: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, సిద్దిపేట అర్బన్: మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ సమ్మిళిత అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పక్షాలను కూడా ఆహ్వానించే మంచి సంసృతి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళితే.. అక్కడి సీఎం స్టాలిన్ మోదీకి సాదర స్వాగతం పలికారని.. ఇక్కడ మాత్రం సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకరని నిలదీశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించే వేస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా మోదీకి ఘన స్వాగతం పలికారని రఘునందన్ గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయాలను బీఆర్ఎస్ పూర్తాగా కలుషితం చేస్తోందని.. ఇది మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. పీకే సలహా వల్లే సీఎం కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం.. రాష్ట్రానికి ఏమి చేయట్లేదని మంత్రి హరీష్ రావు మాట్లాడటం అవివేకం అని అన్నారు. కేంద్రం సహరించకపోతే సిద్దిపేటకు రైల్ ఎలా వస్తుందని, జాతీయ రహదారులు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు.

మళ్లీ ఎన్నికల వరకు సిద్దిపేటలో రైల్ ఆగుతుందని రఘునందన్ తెలిపారు. దుబ్బాక లో బీజేపీ గెలవడం వల్లే తన నియోజకవర్గానకి నిధులు అపేస్తూ.. విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకారం లేకపోతే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ కోసం రూ.11 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందన్నారు. రాజ్ దీప్ సర్దేశాయ్ కి ప్రతిపక్షాల కూటమికి తనను చైర్మన్ చేయాలనడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉడుత మల్లేశం, మహిళా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

‘రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు’

Advertisement

Next Story

Most Viewed