BREAKING: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

by Shiva |   ( Updated:2024-07-08 12:41:59.0  )
BREAKING: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనే మాట వినబడకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఏసీబీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. లంచం తీసుకున్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని, కేసులు బుక్ చేసి కోర్టుల్లో హాజరుపరచాలంటూ స్పష్టం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై మాటు వేసి లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మెదక్ జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో లంచం తీసుకుంటూ హావేలిఘనపూర్ ఎస్సై ఆనంద్ అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి రూ.20‌ వేలు లంచం తీసుకుంటుండగా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్సై ఆనంద్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా హావేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed