- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CANADA: కెనడాలో విపరీతంగా పెరిగిన నిరుద్యోగం..వెయిటర్ ఉద్యోగాల కోసం క్యూ కట్టిన 3వేల మంది విద్యార్థులు..వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో విదేశాల్లో మాస్టర్ చదువుల(Masters studies) కోసం వెళుతున్న భారతీయు విద్యార్థులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.అక్కడికి వెళ్లాక సరైన ఉపాధి అవకాశాలు దొరక్క చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బందిపడుతున్నారు.ఇదిలా ఉంటే..గత కొన్ని ఏళ్లుగా వివిధ దేశాల నుంచి చాలా మంది విద్యార్థులు కెనడా(CANADA)లో చదువుకోవడానికి వెళ్తున్నారు.దీంతో ఆ దేశంలో నిరుద్యోగం(Unemployment) చాలా పెరిగిపోయింది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.కెనడాలోని బ్రాంప్టన్(Brampton) ప్రారంభమైన తందూరీ ఫ్లేమ్ రెస్టారెంట్(Tandoori Flame Restaurant) లో పనిచేయుటకు వెయిటర్, సర్వీస్ స్టాఫ్(Waiter, service staff) ఉద్యోగాల కోసం ఆహ్వానం పలికింది.అయితే ఈ ఉద్యోగాల గురించి తెలుసుసుకున్న దాదాపు మూడు వేల మంది విద్యార్థులు తమ రెజ్యూమ్(Resume) లను చేతిలో పట్టుకొని ఇంటర్వ్యూకి(Interview) అటెండ్ అయ్యేందుకు క్యూ కట్టారు. వీరిలో చాలా మంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కెనడాకు రావాలనుకునే భారతీయులు ఒకటికి రెండు సార్లు ఆత్మ పరీశీలన చేసుకోని నిర్ణయం తీసుకోవాలని పోస్టులు పెడుతున్నారు.