Pally Masala: పల్లీ మాసాలతో టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ..!!

by Anjali |
Pally Masala: పల్లీ మాసాలతో టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగానే పల్లీలతో ఎన్నో లాభాలు ఉంటాయి. పల్లీలు తింటే షుగర్ లెవల్ కంట్రోల్ లో ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంచడంలో, జీర్ణ వ్యవస్థ పనితీరు, మెదడు పనితీరు, వెయిట్ లాస్ అవ్వడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాగా ఇటువంటి పల్లీ మసాలతో బీరకాయ కర్రీ చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. కాగా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

పల్లీ మసాల బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు..

పచ్చికొబ్బరి పల్లీలు, ఉల్లిపాయలు, బీరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, కొత్తిమీర, ఆవాలు, పసుపు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ధనియాల పొడి, సాల్ట్, కారం, తగినంత ఆయిల్ తీసుకోండి.

తయారీ విధానం..

బీరకాయల్ని శుభ్రంగా కడుక్కుని చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత పల్లీలు ఆయిల్ లేకుండా వేయించి.. పచ్చికొబ్బరి ముక్కలతో కలిపి మిక్సీ పట్టండి. తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ వేసి వేడాయ్యాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించండి. 10 నిమిషాలు అయ్యాక పసుపు, జీలకర్ర పొడి, సాల్ట్, ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక కట్ చేసి పక్కకు పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఉడికించండి. బీరకాయ ముక్కలు ఉడికాక.. పల్లీ కొబ్బరి పేస్ట్ వేసి అరకప్పు వాటర్ పోసి సిమ్ లో పెడితే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ పల్లీ మసాలా బీరకాయ కూర తయారు అయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed