హరిహరుల సన్నిధిలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

by Y. Venkata Narasimha Reddy |
హరిహరుల సన్నిధిలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి కొండపై కొలువైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకార సేవ.. దర్శనం, ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణములు, గాయత్రీ జపాలు, లలిత సహస్రనామార్చన, మధ్యాహ్న పూజ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం శ్రీదేవి చతుషష్టి ఉపచార పూజ సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు తీర్థ ప్రసాద వితరణ జరిపారు.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. మరోవైపు ఆదివారంతో పాటు దసరా సెలవుల నేపథ్యంలో యాదగిరిగుట్టకు భక్తుల రద్దీ పెరిగింది.

Advertisement

Next Story