Drugs seize: రూ.1814 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అరెస్ట్

by vinod kumar |
Drugs seize: రూ.1814 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర రాజధాని భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌, ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్టు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు ఓ ఫ్యాక్టరీపై సోదాలు నిర్వహించగా డ్రగ్స్, వాటి తయారీకి ఉపయోగించే వస్తువులను గుర్తించి సీజ్ చేశారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.1,814 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీకి హర్ష్ సంఘవి అభినందనలు తెలిపారు. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చేందుకు ఈ ఆపరేషన్ ఎంతో కీలకమని కొనియడారు.

Advertisement

Next Story