- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన పాట.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలుసా..
వెబ్‌డెస్క్ : వినోదం అనేది మన జీవితంలో ముఖ్యమైన భాగం. ఆటలు, పాటలు, ఎంజాయ్ మెంట్ లు లేని జీవితం గురించి ఆలోచిస్తే బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే చాలామంది ఎక్కువగా తమ మూడ్ ని మార్చుకోవడానికి పాటలను వింటూ ఉంటారు. మధురమైన సంగీతం మనస్సును రిలాక్స్ చేయడమే కాకుండా మనిషికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే కొన్ని పాటలు మాత్రం వ్యక్తలను డిప్రెషన్‌లోకి తీసుకువెళతాయి. మనం ఈ రోజు అలాంటి ఓ పాట గురించి తెలుసుకుందాం. ఆ పాటను విన్నవారు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని చరిత్ర చెబుతుంది. ఇంతకీ అంత గొప్ప పాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మూడ్ బాగుండాలని పాటలు వింటారు. కానీ ఈ పాట విన్నవారు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారట. అందుకే ఆ పాటను చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన పాటగా పరిగణించారట. ఈ పాటను విన్న తర్వాత సుమారు 100 మంది తమ ప్రాణాలను వదులుకున్నారని చరిత్ర చెబుతుంది. హౌ స్టఫ్ వర్క్ వెబ్‌సైట్ ప్రకారం గ్లూమీ సండే పాట ప్రపంచంలోనే అత్యంత దిగులుగా ఉండే పాట అని చెబుతున్నారు.
ఈ పాటను ఎవరు రాశారు ?
ఈ పాటను Rezső Seress, László Jávor రచించారట. 1933లో రాసిన ఈ పాట 1935 వరకు వినడానికి అందుబాటులో ఉంది. ఈ పాట చాలా కష్టంతో రికార్డ్ చేశారట. ఇక ఈ పాట రిలీజ్ అయ్యాక 1935లో బుడాపెస్ట్‌లో ఒక చెప్పులు కుట్టేవాడు ఆత్మహత్య చేసుకున్నాడట. అతను చనిపోతూ సూసైడ్ నోట్‌లో గ్లూమీ సండే పాటలోని పంక్తులను పేర్కొన్నాడట. అలాగే పాటల రచయితలలో ఒకరికి కాబోయే భార్య విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిందని, సూసైడ్ నోట్‌లో 'గ్లూమీ సండే' అని మాత్రమే రాసి ఉందని చాలా మంది పేర్కొన్నారట. అలాగే గీత రచయిత రెజ్సో సెరెస్ స్వయంగా 1968లో ఆత్మహత్య చేసుకున్నాడట. అంతే కాకుండా పాట విని ఇద్దరు వ్యక్తులు కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, ఓ మహిళ నీటిలోకి దూకిందని చెబుతారు. ఈ సంఘటనల తర్వాత పాట నిషేధించారని చెబుతున్నారు.
ఈ పాటలో ఏముంది?
హౌ స్టఫ్ వర్క్స్ అనేది సైన్స్ సంబంధిత సైట్. దాని నివేదికలో ఈ పాట ప్రభావం శాస్త్రీయంగా, తార్కికంగా కనిపించిందని చెప్పారు. ఇది హంగేరియన్ పాట అని, హంగేరీలో ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. పాట విడుదలైనప్పటికే ప్రజలు డిప్రెషన్‌లో ఉన్నారని తెలిపింది. అక్కడి ప్రజల వద్ద డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు. అదే సమయంలో విడుదలైన ఈ పాటలోని సాహిత్యం వారి జీవితానికి సంబంధించినదని భావించిన వారు మరింత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మానవత్వం, మరణం, విచారం, ముగింపు గురించి పాటలో రాశారని పేర్కొన్నారు.