- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సన్ రైజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : సన్ రైజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఎనమిదేళ్ల నుంచి మే 9న బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. కాగా, మంగళవారం సంగారెడ్డిలోని సన్ రైజ్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వాహకులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ లో మొత్తం 130 మంది వాలంటరీలు పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్టు తరపున, పూర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తరపున ప్రభుత్వ పాఠశాలలను దత్తత చేసుకొని అక్కడి విద్యార్ధులకు ప్రతి ఏడాది బుక్స్, బ్యాగ్స్ అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ లో తల్లిదండ్రులు చనిపోయిన ఆరుగురు పిల్లలను దత్తత తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సన్ రైస్ చారిటబుల్ ట్రస్టు తరపున ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్ నిర్వాహకులు స్వామి గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.