- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BC Commission Chairman : బీసీ కమిషన్ అంటే తమాషాగా ఉందా..
దిశ, సంగారెడ్డి : బీసీ కమిషన్ చైర్మన్ అంటే అంత అలుసా.. తమాషాగా ఉందా..? అంటూ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ బహిరంగ విచారణలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ రిసీవ్ చేసుకోవాలి. కానీ సంగారెడ్డిలో కలెక్టర్ కు బదులుగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీంద్రారెడ్డిలు స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా బీసీ కమిషన్ సభ్యులను స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ రావాలి కదా.? ఎందుకు రాలేదంటూ చైర్మన్ నిరంజన్ అక్కడికి వచ్చిన అధికారులను ప్రశ్నించారు. బీసీ కమిషన్ అంటే కలెక్టర్ కు అంత అలుసా.. జిల్లాకు వస్తే ప్రోటోకాల్ పాటించరా..? కమిషన్ అంటే తమాషాగా ఉందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాకపోతే నేనెందుకు నేను హైదరాబాద్ వెళ్లిపోతా.. మీటింగ్ కు హాజరుకాను అన్నారు. కలెక్టర్ బీసీ కమిషన్ కు అవమానం కలిగించారని, దీని పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ చాంబర్ కు వెళ్లి వెళదామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అనగా అవసరం లేదు. మీటింగ్ హాల్ ఎక్కడుంది.. నేరుగా అక్కడికే వెలదాం.. కలెక్టర్ ను చాంబర్ లోనే ఉండమని మీటింగ్ కు రావద్దని చెప్పండంటూ ఆగ్రహిస్తూ సమావేశానికి వెళ్లారు.