పీవీకి నివాళులు అర్పించిన Bandi Sanjay

by samatah |   ( Updated:2022-12-23 07:02:53.0  )
పీవీకి నివాళులు అర్పించిన Bandi Sanjay
X

దిశ, కరీంనగర్: భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివీ నరసింహరావు 18వ వర్థంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. కరీంనగర్ పార్లమెంట్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్ విమోచన కోసం సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారని, స్వయం కృషితో భారత పీఠాన్ని అధిరోహించిన మహానేత అని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ బహుభాషా కోవిదుని, ఆర్థిక సంస్కరణల పితామహునిగా దేశానికి అందించిన సేవలు ఆదర్శ ప్రాయమన్నారు. రచయితగా, ఉద్యమ నేతగా, ఉన్నత విద్యావంతుడిగా ఎదిగిన పీవిని స్మరించుకుని ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి మహోన్నత వ్యక్తుల గురించి అందిచినట్టయితే వారి అడుగు జాడల్లో నడిచే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed