అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

by Sumithra |
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..
X

దిశ, చేగుంట : రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని స్వాధీనపరచుకున్నట్లు చేగుంట తహసీల్దార్ లక్ష్మణ బాబు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు చేగుంట మండల కేంద్రంలోని మొక్క రాజుపేట రోడ్డు నుండి వెళ్తున్న అశోక్ లేలాండ్ ఆటో వాహనంలో 34 క్వింటాళ్ల 20 కిలోల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు.

71 ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని అట్టి బియ్యాన్ని స్వాధీనపరచుకొని గోదాంలో నిలువ చేసినట్టు తెలిపారు. అశోక్ లేలాండ్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్లు తెలిపారు. వాహన డ్రైవర్ను ప్రశ్నించగా అనంతసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తి తరలిస్తున్నట్లు తెలుపగా మిగతా వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story