- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
దిశ, సంగారెడ్డి: నెల రోజుల్లో పంట కోతకు రానున్నందున యాసంగి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం జిల్లా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, సంబంధిత శాఖల అధికారులతో, రానున్న యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ఖాళీ సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించే యంత్రాలు, తూర్పార బట్టి యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.
రైతుల తీసుకొచ్చే ధాన్యం తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో 84, పీఏసీఎస్ 76, డీసీఎంఎస్ 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. రైతులు తాము తీసుకువచ్చే ధాన్యంలో తాలు లేకుండా ధాన్యం తూర్పార బట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డీఏం సివిల్ సప్లై ప్రశాంత్, డీసీఓ ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.