- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saddula Batukamma : సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి..
దిశ, సంగారెడ్డి : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన స్వంత నిధులతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎక్కడ చూసిన ప్లడ్ లైట్ల వెలుగులు, రంగురంగుల కటౌట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే అతి పెద్ద బతుకమ్మను సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ఏర్పాటు చేశారు. అదే విధంగా సంగారెడ్డి పట్టణంలో సద్దుల బతుకమ్మ సందర్బంగా అన్ని వార్డుల్లో మహిళలు బతుకమ్మ ఆడేందుకు వార్డు కౌన్సిలర్లు ఏర్పాట్లు చేశారు. వార్డులో మహిళలకు సౌండ్ బాక్స్ లు, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని మహిళలు సద్దుల బతుకమ్మ వద్ద బతుకమ్మ పాటలు పాడుతూ లయ బద్దంగా డ్యాన్స్ లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు రాత్రి 10.00 గంటలకు మహబూబ్ సాగర్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
భారీ ఏర్పాట్లు చేసిన జగ్గారెడ్డి..
తెలంగాణలోనే మహిళలకు ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి పట్టణంలో ప్లడ్ లైట్ల వెలుగులు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా పట్టణ మహిళలు బతుకమ్మలను మహబూబ్ సాగర్ లో నిమజ్జనం చేసే సందర్బంగా చెరువు కట్టపై పెత్త ఎత్తున బతుకమ్మ ఆటలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మహబూబ్ సాగర్ కట్టపై 26 అడుగల ఎత్తుగల బతుకమ్మను అందంగా తయారు చేశారు. ఈ బతుకమ్మ10 టన్నుల భారీ బతుకమ్మ సిద్దం చేశారు. 26 అడుగుల ఎత్తున రంగురంగుల పూలతో ఆకర్శనీయంగా తీర్చిదిద్దారు. 3.50 టన్నుల పువ్వులు, ఐదున్నర టన్నుల స్టీల్ ఉపయోగించారు. అత్యంత భారీ సద్దుల బతుకమ్మ జగ్గారెడ్డి ఆధ్వ ర్వంలో నిర్వహించారు.