Andole Assembly constituency : ఎడ్యుకేషన్‌ హబ్‌గా అందోలు

by Naresh |   ( Updated:2023-11-23 13:34:04.0  )
Andole Assembly constituency : ఎడ్యుకేషన్‌ హబ్‌గా అందోలు
X

దిశ, అందోల్‌: చదువు పై ఉన్న మక్కువ...పైసా...పైసా కూడగబెట్టి...వందలాది మంది రైతులు, వారి పిల్లల భవిష్యత్‌ కోసం వారు పండించిన పంటలో కొంత నగదును పొగుచేసి జోగిపేటలో డిగ్రీ కళాశాలను నిర్మింపజేశారు. ఉమ్మడి జిల్లాలోనే రెండో కళాశాలగా ఇది ప్రసిద్ది గాంచింది. ఇక్కడి ప్రాంత వాసులకు చదవుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ విద్య వ్యవస్థను పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన అందోలును ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు పట్టుదలతో ఉన్నత, సాంకేతిక విద్యావ్యవస్థను ప్రజలకు చేరవ చేయడంలో దామోదర్‌ ఎంతోగానో కృషి చేశారు. ప్రధానంగా పుల్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద జేఎన్‌టీయూ కళాశాల, అందోలు మండంలో సంగుపేట వద్ద వ్యవసాయ మహిళ పాలిటేక్నిక్‌ కళాశాల, జోగిపేటలో మహిళ పాలిటేక్నిక్, పుల్కల్‌ మండలం వొన్నపురం వద్ద జనరల్‌ పాలిటేక్నిక్‌ కళాశాల, జోగిపేటలో మహిళ ఇంటర్, డిగ్రీ కళాశాలలు, జనరల్‌ పీజీ కళాశాలలను ఏర్పాటు చేయించారు.

మండలానికోక మోడల్‌ స్కూల్, జూనియర్‌ కళాశాలలు, కస్తూర్భాగాంధీ పాఠశాలలు, టేక్మాల్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాల, బొడ్మట్‌పల్లి ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా గుర్తింపు, ఎస్‌సీ, బీసీ హస్టల్‌లు, జోగిపేట ఉన్నత పాఠశాలలకు మోడల్‌ భవనం, మండలానికొక మోడల్‌ స్కూల్, వసతి గృహాలు, స్వంత భవనాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో అందోలు నియోజకవర్గ విద్యార్థులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ వివిధ విద్యావ్యవస్థలో విద్యనభ్యసిస్తున్నారంటే దామోదర్‌ కృషి, పట్టుదలతోనే సాధ్యమైందని ఇక్కడి ప్రజానీకం చెప్పుకుంటున్నారు.

అందోలులో ఉన్నత విద్య:

జోగిపేట కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్యనభ్యసించాలంటే పట్టణ ప్రాంతాలకు వేళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దామోదర్‌ హయాంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళ ఇంటర్, డిగ్రీ కళాశాల, మహిళ పాలిటేక్నిక్, జనరల్‌ పాలిటేక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి మహిళ వ్యవసాయ పాలిటేక్నిక్‌ కళాశాలను తీసుకొచ్చి, వందలాది మంది విద్యార్థినీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఇవే కాకుండా కళాశాల వసతి గృహాలు, భవనాలను నిర్మించారు. క్రీడలను ప్రొత్సహించేందుకు జోగిపేటలో ఎన్‌టీఆర్‌ మైదానంలో రూ.2.10 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియాన్ని నిర్మించారు. కానీ ఆ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో బీఆర్‌ఎస్‌ పాలకులు నిర్లక్ష్యం చేయడంతో, ఆసాంఘీక కార్యక్రమాలకు అడ్డగా మారింది. రాయికోడ్‌కు మంజూరు చేసిన క్రీడా కళాశాలను దామోదర్‌ మంజూరు చేయిస్తే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేటకు తరలించి, ఇక్కడి ప్రాంతానికి అన్యాయం చేశారు.




సుల్తాన్‌పూర్‌లో జేఎన్‌టీయూ కళాశాల:

ఉమ్మడి పుల్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద 2012లో 160 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా రూ.350 కోట్లతో జేఎన్‌టీయూ కళాశాలను అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో నాలుగు విభాగాల కోర్సులు కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్, మెకానిక్, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల కోర్సులు ఉండగా, ప్రతి విభాగంలో 66 మంది విద్యార్థుల చోప్పున ప్రతి ఏటా 266 మంది అడ్మిషన్‌లు పొంది, సుమారుగా వేయ్యి మందికి పైగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. బాలుర, బాలికల వసతి గృహాలు, కళాశాల సిబ్బంది, అధ్యాపకుల వసతి గృహాలు, డిజిటల్‌ లైబ్రరీ, స్పోర్ట్స్‌ కాంప్లేక్స్, వైద్య చికిత్స కేంద్రం, క్యాంటీన్‌ సౌకర్యాలు ఉన్నాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, జేఎన్‌టీయూ కళాశాల పరిసర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఆదాయాన్ని కళాశాల అభివృద్దికి ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దామోదర్‌ గెలిస్తే జేఎన్‌టీయూ కళాశాలను విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో యువకులు స్వతహాగా దామోదర్‌ గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed