- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG High Court: పట్నం నరేందర్రెడ్డి పిటిషన్పై తీర్పు రిజర్వ్
దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన (Lagacharla Incident) అంశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendra Reddy) దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సోమవారం తెలంగాణ హైకోర్టు (TG High Court) రిజర్వు చేసింది. లగచర్ల దాడి ఘటనలో బోంరాస్ పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరుపై పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య అఫిడవిట్ దాఖలు చేశారు. రాజకీయ కక్షలతోనే ఈ కేసులు నమోదు చేశారని ఒక దాని తర్వాత మరొకటిగా కేసులు పెట్టి పిటిషనర్ ను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒకే నేరం పై పలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పిటిషనర్ ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ ప్రస్తావించగా దాడి ఆధారంగానే పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని, కేసుల వివరాలను ఏఏజీ రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.