- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలేకరుల పై ఎమ్మెల్యే దాడులు చేయించడం సరికాదు.. నత్తి దశరథ్
దిశ, చౌటకూర్ : నిజాలను నిర్భయంగా రాసే విలేకరుల పై అధికార పార్టీకి చెందిన నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ చౌటకూర్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నాడు చౌటకుర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విలేకరులు ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో ఆందోల్ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పై వార్తలు రాస్తే అలాంటి విలే కరుల పై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అనుచరులు దాడి చేసి జర్నలిస్టులను అవహేళన చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై ఎంతైనా ఉందన్నారు. గత 15 సంవత్సరాల క్రితం తమ అధినేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన అభివృద్ధి పనులే నేటికీ గుర్తుండి పోయేలా ఉన్నాయన్నారు.
24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు కనీసం 8 గంటలు కూడా సరిగ్గా విద్యుత్తును అందించ లేకపోతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం అది మాటలకే పరిమితం అయ్యిందే తప్ప ఆచరణలో మాత్రం అది సాధ్యం కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కళాలి రామా గౌడ్, మొగులయ్య, మండల ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి రామచంద్రారెడ్డి, యూత్ మండల అధ్యక్షులు దానం పల్లి సుధాకర్, ఉపాధ్యక్షులు సిహెచ్ మహేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఆబేద్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ కైసర్, పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, రవీందర్, కృష్ణ, మల్లికార్జున్ గౌడ్, బంటు ఆనంద్, సందీప్ కుమార్, మమతా రఘునాయక్, అక్బర్ ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.