మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ బిల్స్ అన్ని మంజూరు చేయాలి

by Naresh |
మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ బిల్స్ అన్ని మంజూరు చేయాలి
X

దిశ , జహీరాబాద్: ఈనెల 12వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులన్నీ క్లియర్ చేసి, కొత్త పీఆర్సీ పై ప్రకటన చేయాలని తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దత్తాత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జహీరాబాద్ డివిజన్ సమావేశం స్థానిక సరస్వతి శిశు మందిర్‌లో డివిజన్ అధ్యక్షులు తుక్కప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ..ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ, ఉద్యోగుల బిల్స్ పెండింగ్‌లో ఉన్నందున వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నూతన ప్రభుత్వం వచ్చి మూడు నెలలైనా ఒక్క బిల్లు కూడా క్లియర్ చేయకపోవడం శోచనీయమన్నారు. అదే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ వేసవి సెలవుల్లో పూర్తిచేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ విజయ్, కృష్ణ, చంద్రశేఖర్ నరేందర్, శేఖర్, జయప్రకాష్ మొగులయ్య, బాలకృష్ణ కృష్ణ, యాదయ్య, ఈశ్వర్ శివరాజ్, విఠల్, శ్రీనివాస్ మల్లేశం, అశోక్ హనుమంతు, దయాకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed