- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో… నిందితుడికి 7ఏళ్ల కారాగార శిక్ష
దిశ, మెదక్ ప్రతినిధి : అమ్మమ్మ ఇంట్లో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ను మత్తులో దింపి అత్యాచారం చేసిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ .20 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మైనర్ బాలిక తల్లి చిన్నప్పుడే మృతి చెందడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మైనర్ బాలిక సెలవుల్లో అమ్మమ్మ వద్ద కు వెళ్లి వచ్చేది. అదే ఇంట్లో ఉండే శ్రీనివాస్ మైనర్ బాలిక తమ్ముడు ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టేవాడు. అశ్లీల చిత్రాలు చూపించి బలవంతంగా కల్లు తాగించి మత్తులో ఉన్నప్పుడు అత్యాచారం కు పాల్పడ్డాడు. నిద్రలో ఏమీ చేసేవాడో కూడా బాలికకు తెలిసేది కాదు. కానీ ఇద్దరి మధ్య జరిగిన విషయం బయట చెబుతే చంపేస్తా అని బెదిరించాడు.
దీంతో భయపడిన బాలిక సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి బయటపడింది. ఎందుకు ఇంటికి రావడం లేదని ఆరా తీయగా బాలికపై జరిగిన అత్యాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ దిలీప్ ఫోక్సో కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. మంగళవారం వాదోపవాదాలు విన్న జిల్లా ప్రధాన సెషన్ జడ్జి లక్ష్మి శారద పూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడి శ్రీనివాస్ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో శ్రీనివాస్ కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ కుమార్ వాదించారు. కేసు విచారణ అధికారి దిలీప్ తో పాటు ప్రస్తుతం సీఐ నాగరాజు, ఎస్ఐ విట్టల్, హనుమంతు, కానిస్టేబుళ్ళు రవీందర్ గౌడ్ కేసు పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.