- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పరిశ్రమల్లో ప్రమాదాలు బాధాకరం
దిశ, గుమ్మడిదల : పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని జిల్లా ఎస్పీ సీహెచ్. రూపేష్ కుమార్ అన్నారు. గురువారం గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వార్డులో గల హెట్రో యూనిట్ వన్ పరిశ్రమలో బొంతపల్లి, బొల్లారం, కాజిపల్లికి సంబంధించిన పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో తయారు చేస్తున్న ఉత్పత్తుల వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని, అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటే వాటిని
నివారించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ వివరాలను బోర్డుల్లో వివరించాలని కోరారు. గత కొద్ది రోజుల క్రితం హత్నూర మండలం చందాపూర్ గ్రామ పరిధిలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికవేత్తలు పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్మికుల పట్ల తీసుకోవాల్సిన సేఫ్టీ నియమాలు, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. పరిశ్రమలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పనితీరుపై ఎప్పటికప్పుడు పరీక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, పరిశ్రమల సిబ్బంది సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీఐలు జిన్నారం సుధీర్ కుమార్, బొల్లారం గంగాధర్, శ్రవణ్ కుమార్, నియోజకవర్గ పరిధిలోని ఎస్సైలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.