లైన్ మెన్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

by Disha daily Web Desk |
లైన్ మెన్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
X

దిశ సిద్దిపేట: నారాయణ రావు పేట మండలం గుర్రాలగొంది గ్రామ లైన్మెన్ రాజిరెడ్డి తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిండు ప్రాణం బలి అయిందనీ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు సమాచారం మేరకు కాత రాములు శుక్రవారం గ్రామంలోని చెరువు కట్ట కింద ఉన్న కుంటలో చేపల వేటకు వెళ్ళాడు. పక్కనే విద్యుత్ వైర్లు తెగిపడటంతో రాములు షాక్ కు గురై అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడ వైర్లు తెగిపడటంతో పక్కనే ఉన్న ఒక రైతు విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అయినప్పటికి లైన్ బంద్ చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించి రాములు మృతికి కారణమైన లైన్ మెన్‌ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, కుల సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story