రోడ్డు మధ్యలో గుంత.. ఆదమరిస్తే చింత

by Aamani |
రోడ్డు మధ్యలో గుంత.. ఆదమరిస్తే చింత
X

దిశ, రాయికోడ్ : మహాబత్పూర్ నుంచి గంగ్వార్ వెళ్లే జాతీయ రహదారి మధ్యలో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఆ జాతీయ రహదారికి సమీపంలో రెండు కాటన్ పత్తి మిల్లులు ఉన్నాయి. మిల్లులకు దూర ప్రదేశాల నుండి ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా పత్తిని రైతులు తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. కొన్ని టన్నుల పత్తిని జాతీయ రహదారిపై నుంచి తిరుగుతూ ఉంటాయి.

అలాంటి రోడ్డుకు మధ్యలో గుంత ఉండడం ద్వారా ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్న పట్టించుకోని అధికారులు, అలా కాస్త ముందుకెళ్లి కొద్ది అలాంటి గుంతలు ఎన్నో ఉన్న చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు, అదే జాతీయ రహదారిపై నుంచి మండల కార్యాలయానికి ప్రజలు నిత్యం వెళుతూ ఉంటారు. నిత్యం వాహనాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. మిట్ట మధ్యాహ్నమే తప్పని, తిప్పలు రాత్రి సమయంలో వాహనదారులు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తూ ఉంటారు. అంతుచిక్కని ప్రమాదాలు చోటు చేసుకోక ముందే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed