- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎండాకాలంలో నీళ్లే నీళ్లు.. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
దిశ, మిరుదొడ్డి : తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి.. నిండిన చెరువులు, కుంటలు, వాగు వంకలు కనిపిస్తున్నాయి.. తెలంగాణ మొత్తం సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేసి రామరాజ్యాన్ని తీసుకొచ్చారని మహారాష్ట్ర రైతులు ప్రశంసించారు. మహారాష్ట్రకు చెందిన 120 మంది రైతు ప్రతినిధుల బృందం మల్లన్న సాగర్ పంప్ హౌజ్, కట్టను పరిశీలించారు. కరువు కాలంలో మల్లన్న సాగర్ నీళ్లను చూసి వారు ఖుషీ అయ్యారు. మా ప్రాంతలో కరువు, కాటకాలతో రైతులు అల్లాడుతున్నారని, ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్, తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ రహే, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ పంప్ హౌస్ లో కాళేశ్వరం ప్రాజెక్టును పటం ద్వారా చూపిస్తూ ప్రాజెక్టు విశేషాలను సంపూర్ణంగా వివరించారు. మేడిగడ్డ వద్ద మొదలైన ప్రాజెక్టు 10 పంప్ హౌజ్ ద్వారా 420 మీటర్ల ఎత్తు నుండి వందల కిలో మీటర్ల నుండి ఇక్కడికి తీసుకువచ్చారని వివరించారు. 2014లో అధికారంలోకి రాగానే కరువుతో బీటలు పడ్డ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి 4 నెలల పాటు రాత్రింబవల్లు అధికారులతో సమావేశం నిర్వహించాడని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంను ప్రజల అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేసి నూతన ప్రాజెక్టులు నిర్మించాలని ప్రణాళిక వేశామన్నారు. 420 మీటర్ల లోతులో ఉన్న గోదావరి నీళ్లను తెలంగాణకు తరలించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సందిళ్ల, గాయిత్రి, అన్నపూర్ణ, ఎమ్మెమ్మార్, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు గోదావరి నీళ్లను తరలించారన్నారు. మేటిగడ్డ నుండి మొదలైన ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజ్లు, ఆనకట్టలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం గురించి వివరించారు. 200 కిలోమీటర్ల దూరం నుండి గోదావరి నీళ్లను తీసుకువొచ్చి ఇక్కడ నిలువ చేయడంపై రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు డెలివరీ చానల్ను పరిశీలించారు. మూడున్నర ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై వారు ప్రశంసించారు. దేశంలో అతిపెద్ద భారీ నీటిపారుదల ఎత్తిపోతల ప్రాజెక్టు మల్లన్న సాగర్ అని హరిరామ్ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 8 గ్రామాలు, 17 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని, 22.8 కిలోమీటర్ల చుట్టూరా మల్లన్న సాగర్ కట్టను నిర్మించారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నాయని, వచ్చే సంవత్సరంలో 30 టీఎంసీల నీళ్లు నిలువ ఉంచుతామని వివరించారు. కృత్తిమంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టును చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయని, ఈ తరహా దేశమంతా కావాలంటే, దేశం పచ్చగా ఉండాలంటే సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని రైతు ప్రతినిధులు కోరారు. పంప్ హౌస్, మల్లన్న సాగర్ కట్ట మీద సెల్ఫీలు దిగడానికి రైతు సంఘాల ప్రతినిధులు పోటీ పడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వారి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు మానిక్ కధం, కిసాన్ సెల్ యూత్ అధ్యక్షులు సుధీర్ బిందు, నందేడ్ జిల్లా కిసాన్ సెల్ యూత్ అధ్యక్షులు నవీన్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, మల్లన్న సాగర్ ఎస్ఈ వేణు, ఈఈలు సాయిబాబా, వెంకటేశ్వర్రావు, డీఈలు శ్రీనివాస్, దయాకర్, రమేష్, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, రైతు బంధు అధ్యక్షులు బోధనం కనకయ్య, మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు చిక్కుడు రమేష్ లింగాల స్వామి తదితరులు పాల్గొన్నారు.