పది పరీక్షలకు 99.92 శాతం హాజరు

by Naresh |
పది పరీక్షలకు 99.92 శాతం హాజరు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమైయ్యాయి. జిల్లాలోని 80 పరీక్షా కేంద్రాల్లో ( 58 ప్రభుత్వ, 22 ప్రైవేటు పాఠశాలలు ) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 371 పాఠశాల నుంచి బాలురు 7036, బాలికలు 6,951, ఒక్కసారి ఫెయిల్ అయిన వారిలో బాలురు 3, బాలికలు 3 చొప్పున మొత్తం 13,988 మంది విద్యార్థులకు గాను 13,977 (99.92 శాతం) మంది విద్యార్థులు తొలిరోజు తెలుగు పరీక్ష రాయగా 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ 13,984 మంది విద్యార్థులకు 13,973 మంది హాజరు కాగా 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 4 గురు విద్యార్థులకు 4గురు హాజరయ్యారు. సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ ( మల్టీ పర్పస్), ఇందిరా నగర్ జడ్పీ హైస్కూల్ పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సందర్శించి పరీక్షల నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో వసతులను, సెక్యూరిటీని పరిశీలించారు. అదే విధంగా మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు రవాణా పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్య విద్యార్థులకు అందుబాటులో ఓఆర్ఎస్‌తో పాటుగా అవసరమైన మందులు వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed