సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

by Shiva |   ( Updated:2023-04-05 16:24:07.0  )
సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
X

దిశ, చిన్న కొడూర్: 108 సిబ్బంది సీపీఆర్ చేసి పాప ప్రణాలు కాపాడిన ఘటన చంద్లపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఉన్న మెగా కంపెనీలో పని చేస్తున్న ప్రేమ్ నాథ్ యాదవ్, కవిత దంపతులకు 23 రోజుల క్రితం పాప జన్మించింది. బుధవారం పాపకి తల్లి కవిత స్నానం చేయిస్తుండగా పాప నీరు మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల 108 సిబ్బందికి సమాచారం అందించింది. 108 సిబ్బంది వెంకట్, అశోక్ పాపకు సీపీఆర్ చేసి పాప ప్రాణాలను కాపాడారు. అనంతరం అదే అంబులెన్స్ లో పాపను సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాప ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది అశోక్, వెంకట్ లను సర్పంచ్ సురగొని చంద్రకళ, ఎంపీటీసీ దుర్గారెడ్డి, గ్రామస్థులు, పాప బంధువులు అభినందించారు.

Advertisement

Next Story