బిగ్ బ్రేకింగ్: తెలంగాణ విద్యాశాఖలో భారీగా బదిలీలు

by Satheesh |   ( Updated:2023-04-03 13:45:29.0  )
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ విద్యాశాఖలో భారీగా బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఓ వైపు టీఎస్పీపీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. మరో పక్క టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టెన్త్ పేపర్ లీకేజీపై దర్యాప్తు జరిపించిన సర్కార్.. నలుగురిపై సస్పెషన్ వేటు వేసింది.

అంతేకాకుండా పేపర్ లీక్ ఘటనతో రాష్ట్ర విద్యాశాఖలోను ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పలువురు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇందులో భాగంగా సాంకేతిక విద్య డైరెక్టర్‌గా విజయలక్ష్మి భాయ్, వయోజన విద్య డైరెక్టర్‌గా ఉషారాణి, మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్‌గా రమణకూమార్, ఎగ్జామినేషన్ డైరెక్టర్‌గా కృష్ణారావు బదిలీ అయ్యారు.

Also Read..

బ్రేకింగ్: రేపు టెన్త్ ఎగ్జామ్ వాయిదా..? స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన క్లారిటీ

Advertisement

Next Story