ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం

by Sathputhe Rajesh |
ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 1.05 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. అనంతరం బీఆర్ఎస్ భవన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత భవన్‌లోని మొదటి అంతస్తులోని ఆయన చాంబర్‌కు వెళ్తారు. సాయంత్రం బీఆర్ఎస్ భవన్‌లోని సమావేశం మందిరంలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. దాదాపు గంట పాటు నిర్వహించే సమావేశంలో ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యచరణపై చర్చించనున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్‌లో కేసీఆర్ పాల్గొనే పూజా సామాగ్రిని సిద్ధం చేశారు. అమ్మవారి విగ్రహంతో పాటు నరసింహస్వామి పటాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత పూజలను ప్రారంభిస్తారు.

Advertisement

Next Story

Most Viewed