KTR BOOKS: అర్థం కోసం మనిషి అన్వేషణ.. కేటీఆర్ చదువుతున్న బుక్స్ ఇవే..

by Ramesh N |   ( Updated:2024-06-14 13:58:59.0  )
KTR BOOKS: అర్థం కోసం మనిషి అన్వేషణ.. కేటీఆర్ చదువుతున్న బుక్స్ ఇవే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు పార్టీ లీడర్లకు, ఇటు కేడర్‌కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్‌కూ ఆయన రావడం మానేశారనే పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో సిరియస్‌గా వర్క్ చేసిన కేసీఆర్.. కాస్త రిలాక్స్ అవ్వడం కోసం పుస్తకాలు చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా రెండు పుస్తకాలను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రతిష్టాత్మక గోల్స్ అంటూ రెండు పుస్తకాల ఫోటోలు షేర్ చేశారు.

ఆస్ట్రీయాకు చెందిన సైకాలజిస్ట్, ఫిలాసఫర్ విక్టర్ ఎమిల్ ఫ్రాంక్ల్ రచించిన ‘మ్యాన్స్ సర్చింగ్ ఫర్ మీనింగ్’ (అర్థం కోసం మనిషి అన్వేషణ) అనే పుస్తకాన్ని ఆయన చదువుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇది. నాజీ నిర్బంధ శిబిరాల్లో రచయిత అనుభవాల ఆధారంగా పుస్తకం రూపొందించారు. మనం బాధ నుంచి తప్పించుకోలేం. కానీ దాన్ని ఎలా తట్టుకోవాలో, దాని నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలో, జీవితంలో ఎలా ముందుకు సాగాలో ఫ్రాంక్ల్ తన అనుభవాల ద్వారా పుస్తకంలో తెలియజేశారు. కెనడియన్ జర్నలిస్ట్, రచయిత, పబ్లిక్ స్పీకర్ అయిన మాల్కం గ్లాడ్‌వెల్ రచించిన ‘బ్లింక్: ది పవర్ ఆఫ్ థింకింగ్ వితౌట్ థింకింగ్’ అనే మరో పుస్తకాన్ని కేటీఆర్ చదువుతున్నారు. కాగా, కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. స్ట్రాంగ్‌గా తిరిగిరావాలి అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని పుస్తకాలు చదవాలని నెటిజన్లు వారు చదివిన పుస్తకాలు కేటీఆర్‌తో పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed