- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఆదేశాలు బాధించాయంటూ.. మాణిక్రావు థాక్రేకు మహేశ్వర్రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్పార్టీకి విధేయుడైన తానకు ఎన్నడూ లేని ఆవేదన కలిగిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి మంగళవారం కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్రావు థాక్రేకు లేఖ రాశారు. తాను మొదట్నుంచి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేశానని లేఖలో గుర్తు చేశారు. ‘‘పార్టీ బలోపేతం కోసం తాను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది.
పీఏసీ మీటింగ్లో సీనియర్ లీడర్లు తలా 20 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేయాలని గతంలో ప్రతిపాదించగా.. అది సరైన విధానం కాదని, సీనియర్లంతా కలిసి ఒక్కటే యాత్ర చేయాలని, అప్పుడే కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుందనే అంశం ప్రజల్లోకి వెళ్తుందని నేను గతంలో వాదించిన. అయినప్పటికీ విడివిడిగా చేయాలని సూచించిన మీరు సూచించడంతోనే నేను యాత్రకు శ్రీకారం చూట్టాను. జనాలు కూడా బ్రహ్మరథం పట్టారు. మళ్లీ మీ సూచనతోనే భట్టి చేస్తున్న యాత్రలో నేను విలీనం చేశాను. అసలు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే.
అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా స్వయంగా మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్పా.. కొందరిలా సొంత ప్రతిష్ట పెంచుకోవాలనే అజెండాతో వెళ్లడం లేదు. ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం.? పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా”అంటూ ఏలేటి మహేశ్వర్రెడ్డి థాక్రేకు ఆవేదనతో కూడిన లేఖ రాశారు.