ఫస్ట్ లిస్ట్ తర్వాత బీజేపీ హాట్ సీట్ ఇదే! షాక్‌లో కీలక నేతలు

by Ramesh N |
ఫస్ట్ లిస్ట్ తర్వాత బీజేపీ హాట్ సీట్ ఇదే! షాక్‌లో కీలక నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో 195 మంది అభ్యర్థులతో బీజేపీ అధిష్టానం శనివారం ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి తొమ్మది మంది అభ్యర్థులను ఫైనల్‌ చేశారు. సికింద్రాబాద్‌ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్‌, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, నాగర్ కర్నూల్‌లో భారత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌కు అధిష్టానం టికెట్ కేటాయించింది.

టికెట్ ఆశిస్తున్న కీలక నేతలు వీరే..!

మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం ఫస్ట్ లిస్ట్‌లో అధిష్టానం పేర్కొనలేదు. ఆ స్థానం నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్ అయిన డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండారు శాంతి కుమార్ పలువురు సీనియర్ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో ఆ ఎంపీ స్థానం ప్రకటించకపోవడంతో వారు షాక్‌లో ఉన్నట్లు తెలిసింది. పోటీ పడుతున్న నేతలు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ కోసం ఆ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన తర్వాత ప్రస్తుతం మహబూబ్‌నగర్ సీటు బీజేపీకి హాట్ సీట్‌గా మారింది. ఈ టికెట్ ఎవరికి వస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. దీంతో బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఆ స్థానంలో డీకే అరుణకు టికెట్ కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి తోడున్నాడు. మహబూబ్‌నగర్ టికెట్ నాకే వస్తుందనే నమ్మకమున్నది. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లకు ట్వీట్ మెసేజ్‌ను ట్యాగ్ చేసి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed