- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేములవాడలో కన్నుల పండువగా మహాశివరాత్రి జాతర
దిశ, కోనరావుపేట: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. వేములవాడలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అంచనా ఉండడంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో రాత్రి సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ధర్మగుండంలో కొత్తనీటిని నింపి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
ఏర్పాటు పూర్తి:
ప్రధాన రహదారుల వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలం వైపునుంచి ధర్మగుండానికి కొత్తగా గేట్లు పెట్టడమే కాకుండా.. జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ నుంచి కట్ట కింద బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు నల్లాలు ఏర్పాట్లు చేశారు. మొబైల్ మూత్రశాలలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో సుందరీకరించారు.
శివార్చన ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి:
వేములవాడ గుడిచెరువులో రాష్ట్ర భాషాసాంస్కతికశాఖ అధ్వర్యంలో ఏర్పాటు శివార్చన కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రే దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్‌బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్‌జయంతి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో టీ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవితో కలిసి ప్రారంభించారు. మొదటి రోజు నిర్వహించిన శివార్చన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వందలాది కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలు, జానపద కళాప్రదర్శనలు, కోలాటాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు భక్తులందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Also Read: శివరాత్రి ఎలా జరుపుకోవాలి తెలుసా?