అవును అది నిజం కాదు..కానీ పెద్దపులి సంచారం నిజమే..

by Naveena |
అవును అది నిజం కాదు..కానీ పెద్దపులి సంచారం నిజమే..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవి ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవుల్లోని అమ్రాబాద్ రేంజ్ పరిధిలో.. బికే తిరుమలాపూర్ గ్రామానికి వెళ్లే అడవి మార్గంలో పెద్దపులి సంచారం జరిగినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. కానీ ఆ పెద్దపులి సంచారం నల్లమల్లలోని అమ్రాబాద్ అడవుల్లో కాదని.. అటవీశాఖ అధికారులు తేల్చి చెప్పారు. ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, పెద్దపులి నల్లమల్ల అడవుల్లో సంచారం జరిగినట్టు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో వాస్తవం కాదన్నారు. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల అడవుల్లోని దోర్నాల సమీప చిన్నారుట్ల వద్ద పెద్దపులి రోడ్డుపైకి వచ్చిన సందర్భంగా..యాత్రికులు పెద్దపులి వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed