- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిలావర్‌పూర్ ప్రజలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని.. దిలావర్‌పూర్(Dilawarpur) మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory ) ఏర్పాటు వివాదం కొలిక్కి చేరింది. తమ ప్రాంతంలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని.. దిలావర్‌పూర్ గత 130 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా వారి నిరసనను ప్రభుత్వ అధికారులు(Government officials) పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం స్థానిక గ్రామాల ప్రజలతో కలిసి రహదారిపై మూకుమ్మడి ధర్నా నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వారి వద్దకు వెళ్లిన ఆర్డీవో(RDO) కారును అడ్డుకున్న మహిళలకు ఆమెను.. దాదాపు 6 గంటల పాటు కారులోనే నిర్బంధించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆర్డీవోను రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారడంతో .. రంగంలోకి దిగిన కలెక్టర్ నిరసనకారులతో చర్చించారు. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇదే వ్యవహారంపై ప్రభుత్వం తో చర్చించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దిలావర్‌పూర్ ప్రజలతో ప్రభుత్వం జరిపిని చర్చలు సఫలం అయ్యాయి. నిరసన నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.