తప్పులు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

by Aamani |
తప్పులు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ, నిజాంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వే లో భాగంగా డేటా ఎంట్రీ నీ తప్పులు లేకుండా సజావుగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు రామాయంపేట మున్సిపాలిటీలో డేటా ఎంట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ఆన్లైన్ నమోదు వేగవంతం చేయాలనీ తెలపడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సర్వే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకున్నామన్నారు.

జిల్లా వ్యాప్తంగా 55 వేల కుటుంబాల డేటా ఎంట్రీ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ప్రజలు సర్వేలో అందించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని తెలపడం జరిగిందన్నారు. అనంతరం మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,73,0000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలులో నిర్వాహకులు అలసత్వం వహించొద్దన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామాయంపేట మండల తహసీల్దార్ రజని కుమారి, సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed