Kadapa: చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం.. చంద్రబాబు సీరియస్ వెనుక కారణం ఇదే..!

by srinivas |   ( Updated:2024-11-27 12:06:36.0  )
Kadapa: చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం.. చంద్రబాబు సీరియస్ వెనుక కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ఆర్టీపీపీ(Kadapa District RTPP) ఫ్లైయాష్ తరలింపు వివాదం స్థారా స్థాయికి చేరింది. ఎల్‌అండ్‌టీ కంపెనీ(L&T Company)తో ప్రారంభమైన ఈ వివాదం జిల్లాలో మిగిలిన కంపెనీలకు కూడా ఫ్లైయాష్ తరలింపు నిలిచిపోయింది. ఎల్ అండ్ కంపెనీలతో పాటుపలు కంపెనీలకు జేసీ ప్రభాకర్ రెడ్డి, దేవగుడి కుటుంబాలు ఫ్లైయాష్ బుడిదను తరలిస్తు్న్నాయి. అయితే ఈ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. గత వారం రోజులుగా ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో ఎల్‌అండ్‌టీ కంపెనీలతో పాటు భారతి, జువారి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ సరఫరాను నిలపివేశారు. అయితే తమ లారీలకు ఫ్లైయాష్ లోడిండ్ చేయాలని, లేకపోతే తామే జేసీబీలతో లోడింగ్ చేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(Former MLA JC Prabhakar Reddy) వర్గీయులు పట్టుబట్టారు. ఫ్లైయాష్ లోడింగ్ చేసే వరకూ తమ వాహనాలు కదిలే ప్రసక్తే లేదని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు.

మరోవైపు తమకు రావాల్సిన పాత బకాయిలతో పాటు ఎల్‌అండ్‌టీ కంపెనీ ట్రాన్స్ పోర్టులో 50 శాతం కాంట్రాక్టు అగ్రిమెంట్ ఇవ్వాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(Jammalamadugu MLA Adinarayana Reddy) అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బుధవారం నుంచి ఫ్లైయాష్ సరఫరా తరలింపును తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలను ఆర్టీపీపీ వద్దే నిలిపివేశారు. పూర్తిగా ముళ్ల కంచెలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అటు లోడింగ్ చేసే కాంట్రాక్టర్లు కూడా నిరసనకు దిగారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తాము లోడింగ్ చేయమని తేల్చి చెప్పారు. దీంతో ఫ్లై యాష్ సరాఫరాను నిలిపివేశారు. ఈ మేరకు ఆర్టీపీపీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

అయితే ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో ఆయన సీరియస్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై వివాదం నెలకొంది. ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడి సీఎంవో అధికారులు వివరాలు తెలుసుకున్నారు. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం చెలరేగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేత వ్యవహారం ఉందని సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే సహించేది లేదని మండిపడ్డారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed