బైకుపై నుండి పడిన మహిళ.. పరిస్థితి విషమం 

by Disha News Desk |
బైకుపై నుండి పడిన మహిళ.. పరిస్థితి విషమం 
X

దిశ, నాగర్‌కర్నూల్: గతుకుల రోడ్డు మీదుగా వెళుతుండగా బైక్‌పై నుండి ఓ మహిల జారిపడింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతలు కనబడితే చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పుకున్నారు. కానీ గతుకుల రోడ్లతో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన దంపతులు పిల్లి శ్రీనుయాదవ్, ఉష బైకుపై హైదరాబాద్ వెళుతున్నారు. రోడ్డుపై గతుకుల కారణంగా కొల్లాపూర్ చౌరస్తాలోని నూతన కలెక్టరేట్ భవనం ముందు భార్య ఉష జారిపడింది. తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే 108 సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story